![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'( karthika deepam 2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -668 లో..... కార్తీక్, దీప అడిగారని దక్షిణామూర్తి గురించి పారిజాతం చెప్పాలని అనుకుంటుంది. అక్కడే జ్యోత్స్న కూడా ఉంటుంది. పారిజాతం అతని గురించి చెప్తుంటే అప్పుడే శివన్నారాయణ వచ్చి కోప్పడతాడు. అసలు అతని గురించి ఎవరు అడిగారని శివన్నారాయణ అడుగుతాడు. పారిజాతం తెలివిగా కార్తీక్, దీప పేరు చెప్పకుండా జ్యోత్స్న అని చెప్తుంది. జ్యోత్స్నపై శివన్నారాయణ కోప్పడుతాడు. ఇంకొకసారి ఈ ఇంట్లో అతని ప్రస్తావన రావద్దు.. ఎవరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యొద్దని శివన్నారాయణ కోప్పడతాడు. అందరు వెళ్ళాక ఏంటి గ్రానీ నన్ను ఇరికించావ్.. నేను నిన్ను అడిగానా అని జ్యోత్స్న అడుగుతుంది. లేదు మరి నా మనవరాలి పేరు చెప్తానా అని పారిజాతం అంటుంది. మనవరాలు ఏంటని జ్యోత్స్న అడుగుతుంది.
అంటే మనవడి పెళ్ళాం మనవరాలు అవుతుంది కదా అని పారిజాతం అంటుంది. ఇప్పుడే నీ కళ్ళు తెరిపిస్తానని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు సుమిత్ర దగ్గరికి డాక్టర్ వచ్చి చెకప్ చేసి ఈవిడకి మొన్నే ఆపరేషన్ అయింది కదా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాడు. ఆ తర్వాత నీకు పుట్టిల్లు.. మెట్టిల్లు అంతా ఈ ఇల్లే అని శివన్నారాయణ చెప్తాడు. నువ్వు బాగుండాలి సుమిత్ర దేని గురించి ఆలోచించొద్దని దశరథ్ చెప్తాడు. ఆ తర్వాత పారిజాతంకి నిజం తెలియాలని దాస్ ని జ్యోత్స్న రప్పిస్తుంది. కావాలనే నాన్న అంటూ దాస్ తో మాట్లాడుతుంది జ్యోత్స్న. నీకు ఏం కష్టం వచ్చినా ఈ నాన్న నీకు తోడుగా ఉంటాడు అమ్మ. మా అమ్మ వల్ల నువ్వు ఇలా తయారు అయ్యావని దాస్ అంటాడు. అదంతా పారిజాతం విని షాక్ అవుతుంది. దాస్ వెళ్ళాక ఇప్పటికైనా అర్థం అయిందా వాళ్ళు నిన్ను ఎంత మోసం చేసారోనని జ్యోత్స్న అనగానే దీప తన మనవరాలు అని దాస్ చెప్పింది గుర్తుచేసుకొని ఎంతలా ఆడుకున్నారు రా అని పారిజాతం అనుకుంటుంది.
ఆ తర్వాత కిచెన్ లో దీపకి కార్తీక్ భోజనం తినిపిస్తాడు. అప్పుడే పారు, జ్యోత్స్న వస్తారు. ఏంటి గోరుముద్దలు తినిపిస్తున్నావా అని జ్యోత్స్న అంటుంది. నీకేం తెలుసు ఇలాంటి ప్రేమలు అని కార్తీక్ అంటాడు. ఏం పారు నువ్వు మాట్లాడవేంటని కార్తీక్ అనగానే.. నేను ఏం అంటాను రా అని సంబంధం లేకుండా పారిజాతం మాట్లాడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న వెళ్లేసరికి తన గదిలో పారిజాతం ఉంటుంది. నువ్వు సుమిత్ర కూతురు కానప్పుడు బోన్ న్యారో ఎలా ఇచ్చావని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |